టగ్ ఆఫ్ వార్: బెదిరిస్తే ఖబర్దార్ - పిరికి వాళ్లం కాదు

దీంత ఇరు వర్గాల మధ్య పరోక్షంగా తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తానని హెచ్చరిస్తే అధిష్టానం లొంగదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మరో అడుగు ముందుకేసి రాజీనామా చేస్తే చేసుకోవచ్చునని ఘాటుగా స్పందించారు. పలువురు ఇతర తెలంగాణ ప్రాంత నేతలు కూడా విభజనకు అనుకూలంగా వచ్చే సమయంలో రాజీనామా పేరుతో హెచ్చరిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు.
దానికి సీమాంధ్ర నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారట. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం ఎలాగో తమకు తెలుసునని, అందుకోసం రాజీనామా చేసేంత పిరికివాళ్లం కాదని ప్రతిస్పందిస్తున్నారట.
విభజన విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయముండదని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తామని పలువురు సీమాంధ్ర నేతలు వ్యాఖ్యానించారని, అది వారి వ్యక్తిగత అభిప్రాయమని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. రాజీనామాల విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమతో ఎప్పుడూ చర్చించలేదన్నారు. కాగా దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications