తెలంగాణపై టెన్షన్: సోనియా గాంధీతో కిరణ్ రెడ్డి భేటీ

Kiran kumar Reddy and Sonia
న్యూఢిల్లీ: తెలంగాణపై చర్చించడానికి కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారంనాడు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. కేవలం పది నిమిషాలు మాత్రమే ఆయన సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణపై చర్చించడానికి కోర్ కమిటీ సమావేశం జరగడానికి కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఈ స్థితిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియాతో ఏం మాట్లాడారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి గురువారం సాయంత్రం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. అయన దిగ్విజయ్ సింగ్‌కు రోడ్ మ్యాప్ అందించినట్లు సమాచారం. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా గురువారం సాయంత్రం దిగ్విజయ్ సింగ్‌ను కలిసి రోడ్ మ్యాప్‌లు అందించారు. దిగ్విజయ్ సింగ్‌ వారితో గురువారంనాడు పెద్దగా చర్చలు జరపలేదని తెలుస్తోంది.

ఇదిలావుంటే, తెలంగాణ అంశంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. సీమాంధ్ర నాయకులు అధిష్టానం పెద్దలను కలుసుకోవడంలో తీరిక లేకుండా గడుపుతున్నారు. తెలంగాణ మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు.

తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సీమాంధ్ర నేతలు ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెసు కోర్ కమిటీ ఏం నిర్ణయం వెలువరిస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+