వారిద్దరిని జైలుకు పంపాల్సిందే: సిబిఐ వాదన

వాన్‌పిక్ భూముల కేటాయింపులో అధికారులు, మంత్రులు అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఈ కేసులోనే ధర్మానపై అభియోగాలు మోపామని చెప్పారు. అలాగే దాల్మియా సిమెంటు కంపెనీకి కడప జిల్లాలో 470 హెక్టార్ల సున్నపు రాతి నిక్షేపాల కేటాయింపు మొత్తం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఒక కంపెనీ కోసం లీజులు తీసుకుని మరొక కంపెనీకి వాటి హక్కులను బదలాయించారని, ఈ వ్యవహారంలో సబితను నిందితురాలిగా చేర్చామని చెప్పారు.
కొంత మంది నేతలు తమవారి తప్పేమీ లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారని, ఈ నేపథ్యంలో ధర్మాన, సబిత తాము నిర్దోషులుగా బయటకు వస్తామనడం వల్ల సాక్షులు ప్రభావితమవుతారని అన్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరారు.
ఇదిలావుంటే, రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటని, మాట్లాడటమే తప్పంటూ సిబిఐ వేసిన మెమో దానిని ఉల్లంఘించడమేనని మాజీ మంత్రులు ధర్మాన, సబిత అన్నారు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని, డిశ్చార్జి పిటిషన్‌లో కోర్టుకు నివేదించే అంశాలనే తాము మీడియాతో చెప్పామని, అది ఎంత మాత్రం తప్పు కాదని వారన్నారు.
జ్యుడీషియల్ కస్టడీకి తమను పంపాలని సీబీఐ గత నెల 7న దాఖలు చేసిన మెమోపై నాంపల్లి సిబిఐ కోర్టులో ధర్మాన, సబిత వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. సిబిఐ తీరును ఇరువురూ ఆక్షేపించారు. సిబిఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును కోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications