సమైక్య సభ వాయిదా: 'లగడపాటి' బ్యాట్స్‌మన్ ఎవరు?

Lagadapati Rajagopal - Sailajanath
హైదరాబాద్: ఈ నెల 16వ తేదిన అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర సభను వాయిదా వేసినట్లు మంత్రి సాకె శైలజానాథ్ ఆదివారం తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ప్రచారం జోరందుకోవడంతో అప్రమత్తమైన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ఈ నెల 16న ఆ తర్వాత హైదరాబాదులో సభను నిర్వహిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఢిల్లీ పరిణామాలు ప్రస్తుతం సద్దుమణిగాయి.

దీంతో తమ సభను సీమాంధ్ర కాంగ్రెసు నేతలు వాయిదా వేసుకున్నారు. అధిష్టానం తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లో సభను పెట్టి రెచ్చగొట్టవద్దని నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశాంతంగా ఉన్న సమయంలో అధిష్టానానికి ఇబ్బందులు పెట్టేలా వ్యవహరించడం సరికాదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒప్పించే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని వారు భావిస్తున్నారు. ఈ కారణాల వల్లనే సభను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

'లగడపాటి' స్టార్ బ్యాట్స్‌మెన్ ఎవరు?

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పాటుపడతామని, తమ చేతిలో బ్రహ్మాస్త్రం ఉందని, అవసరమైతే సమైక్యతను కాపాడేందుకు దాన్ని ఉపయోగిస్తామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం చెప్పిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మెన్ రంగంలోకి దిగాడని, ఆ బ్యాట్స్‌మెన్‌తో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందన్న నమ్మకం తమకు కలిగిందని చెప్పారు. ఇంత చెప్పిన లగడపాటి ఆ బ్యాట్సుమెన్ ఎవరో ఇప్పుడు చెప్పనని, సమస్య పరిష్కారమయ్యాక బయటపెడతానని మెలిక పెట్టారు.

దీంతో ఇప్పుడు ఇరు ప్రాంతాలమలో ఆ స్టార్ బ్యాట్సుమెన్ ఎవరనే చర్చ సాగుతోంది. తెలుగు తల్లి ఒడిలో ఉన్న ఆ బ్రహ్మాస్త్రం, ఆ స్టార్ బ్యాట్సుమెన్ ఎవరని తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో చర్చిస్తున్నారు. రాజకీయ వర్గాల్లోని లగడపాటి వ్యాఖ్యలు ఉత్కంఠను రేకెత్తించాయి. అయితే ఆ బ్యాట్సుమెన్ ముఖ్యమంత్రి కావొచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+