'టి' వచ్చాక కెసిఆర్ అవసరం: కెకె, సిటీలో సమైక్య సభ

తెలంగాణను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. ఉద్యమాన్ని కెసిఆర్ లాంటి యోధుడు నడపడం గర్వకారణమన్నారు. తెలంగాణ వచ్చాక తెచ్చింది తామేనని కొందరు వెన్నుపోటు రాజకీయ నాయకులు వస్తారని వారికి ఓటు వేయవద్దన్నారు. రాష్ట్రం ఏర్పడినా కెసిఆర్ నాయకత్వం అవసరమన్నారు.
ముక్కలు కానివ్వం: ఆనం
రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముక్కలు కానివ్వమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాము ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే నక్సలిజం పెరుగుతుందన్నారు.
20న ఇందిరాపార్క్ వద్ద దీక్ష
ఈ నెల 20వ తేదిన సమైక్యాంధ్ర కోసం తాము ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తామని సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి నేత కిషోర్ అన్నారు. వచ్చే నెలలో ప్రజాప్రతినిధులతో కలిసి నిజాం కళాశాలలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.
వెంటనే తేల్చాలి: సిపిఐ రామకృష్ణ
తెలంగాణ అంశాన్ని వెంటనే పరిష్కరించాలని సిపిఐ నేత రామకృష్ణ కర్నూలులో అన్నారు. నాన్చుడు ధోరణి సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే నాయకత్వం వహిస్తే రాష్ట్రం ఖాయమని దిలీప్ కుమార్ అన్నారు. అక్టోబర్ 2న నిజాం కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ రోడ్ మ్యాప్‌తో కాకుండా సూటుకేసులతో వెళ్లారన్నారు.












Click it and Unblock the Notifications