ఫస్ట్ నుండి మద్దతు: 'టి'పై మాయావతి, అఖిలేష్‌పై పైర్

సమాజ్‌వాది పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉత్తర ప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని ఆమె అఖిలేష్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలన్నారు. ఈ ప్రభుత్వంలో పలువురు ప్రజలు భయాందోళలో జీవిస్తున్నారన్నారు. అత్యాచార ఘటనలు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో దోపిడీ పెరిగిందన్నారు.
తమ పాలనలో అవినీతిపరుల పైన చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు అలా లేదన్నారు. తమ పార్టీ వారి పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రజల భద్రత పైన ఏమాత్రం ఆలోచించడం లేదని మాయావతి ఆరోపించారు.
బుద్దగయ పేలుళ్లను తాను ఖండిస్తున్నానని, అక్కడ రేపు పర్యటిస్తానని చెప్పారు. అయోధ్య విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయం చేయవద్దన్నారు. ఈ అంశంపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు.
తాము కులరహిత సమాజం కోసం పోరాడుతున్నామని చెప్పారు. తాము కులల పేర్లతో ర్యాలీలు నిర్వహించడం లేదని, సర్వ సమాజం పేరుతోనే నిర్వహిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications