జాలిపడుతున్నారు: బ్లాగర్‌నయ్యానని అద్వానీ ఆవేదన

దీంతో తాను దారీతెన్నూ తెలియని స్థితిలో ఉన్నానని కొందరు జాలిపడుతున్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ పిపి బాలచంద్రన్ రాసిన 'ఎ వ్యూ ఫ్రం రైజినా హెల్' అనే పుస్తకాన్ని ప్రెస్ క్లబ్‌లో అద్వానీ శుక్రవారం ఆవిష్కరించారు. 1989లో బిజెపి దశ తిరిగిందని, అంతకుముందున్న రెండు సీట్ల బలాన్ని 86కి పెంచుకున్నదని గుర్తు చేశారు.
1984 ఎన్నికల ఫలితాలను చూసి నిరాశ చెందాల్సిన అవసరం లేదని, అవి శోక్‌సభ (మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య వల్ల కాంగ్రెస్‌కు సానుభూతి పవనాలు వీచిన దృష్ట్యా) ఫలితాలని తాను పార్టీ నేతలకు చెప్పానన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ నాయకులు, న్యాయ సమాజం, మీడియా వాళ్లపైనే నేరుగా తీవ్ర ప్రభావం పడిందని, అయితే న్యాయ సమాజం.. ప్రత్యేకంగా హైకోర్టు న్యాయమూర్తులు సమర్థంగా వ్యవహరించారని అద్వానీ వెల్లడించారు.
ఇక ఎమర్జెన్సీ తర్వాత జర్నలిస్ట్ వర్గాలను ఉద్దేశించి ఆయన అన్న మాటలను కూడా గుర్తు చేసుకున్నారు. "మీరు తలవంచాలని మాత్రమే ప్రభుత్వం ఆశించింది. కానీ మీలో కొందరు కాళ్లపై పడటానికి కూడా సిద్ధపడ్డారు. అది నాకు విచారం కలిగించింది'' అని అప్పటి జర్నలిస్టులతో తాను అన్నట్లు అద్వానీ చెప్పారు.












Click it and Unblock the Notifications