బ్యాట్స్‌మన్ ఎవరోచెప్తే బౌలింగ్, కెసిఆర్‌కి భయం: విహెచ్

V Hanumantha Rao
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆ స్టార్ బ్యాట్సుమెన్ ఎవరో చెబితే ఆయనను ఎదుర్కొనేలా తాము బౌలింగ్ వేస్తామని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం అన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న ఆ బ్యాట్సుమన్ ఎవరో చెబితే అతని ఎదుర్కొనేందుకు ఫాస్ట్ బౌలింగ్ వేయాలా? గూగ్లీ వేయాలా? లేక స్పిన్ వేయాలా చూసి ఎదుర్కొంటామన్నారు.

సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని కోరారు. టివీల్లో ఏదో అడుగుతున్నారని మాట్లాడటం సరికాదన్నారు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణకు సంబంధం లేదన్నారు. నాడు ఆంధ్రప్రదేశ్ ఒక్కటిగా లేదన్నారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని తమ పార్టీ పెద్దలు కూడా చెప్పారన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామన్నారు. విడిపోవడం ద్వారానే ఇరు ప్రాంతాలకు లాభమని తెలుసుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పినట్లుగా తెలుస్తోందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే అది ఎందుకు అడగలేదన్నారు. తెలంగాణ ఇచ్చే సమయంలో అది గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇంతమంది ప్రాణాలు పోయాక ప్యాకేజీలు అంటే కుదరదని, అదేదో సీమాంధ్ర ప్రాంతమే తీసుకోవాలన్నారు.

సీమాంధ్రకు ప్యాకేజీ ఇవ్వమని తాము కూడా అడుగుతామన్నారు. ఆ ప్యాకేజీలు ఏవో మీరే తీసుకోవాలని సూచించారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అనడం అవివేకమన్నారు. విభజన కోరేవాళ్లను తరిమి కొట్టాలని సీమాంధ్ర నేతలు చెప్పటం సరికాదన్నారు. సంజీవ రెడ్డి చెబితే విభజన ఆగిపోతుందా అని ప్రశ్నించారు.

కెసిఆర్ పైన ఫైర్

తెలంగాణ వస్తే తమ దుకాణం బంద్ అవుతుందనే భయంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారన్నారు. కాంగ్రెసు తెలంగాణ ఇస్తే తమకు గిరాకీ తగ్గుతుందనే ఆందోళనతోనే ఆ పార్టీ నేతలు తమ పైన విమర్శలు గుప్పిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+