మహిళా టెక్కీ ఆత్మహత్య, భర్త వేధింపుల వల్లనే

వివాహం జరిగినప్పటి నుంచి మేఘనాథ్ ఏ పనీ చేయక జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం రమ్యకీర్తిని వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఆమెకు గర్భస్రావమైందని, సోదరుడి ఇంట్లో ఉన్న ఆమె ఫోన్ చేసి భర్తతో మాట్లాడిందని చెప్పారు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందని, దాంతో మనస్తాపానికి గురై ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించిందని అనుమానిస్తున్నారు.
తండ్రి అంత్యక్రియలు ముగించి హఠాన్మరణం
ఖమ్మం జిల్లా బూర్గంపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బూర్గంపాడులోని గౌతంపురం కాలనీకి చెందిన బర్ల పుల్లయ్య (42) అనే వ్యక్తి తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి శ్మశానం నుంచి తిరిగి వస్తూ అకస్మాత్తుగా మరణించాడు.
గౌతంపురం కాలనీకి చెందిన బర్ల జోగయ్య (72) ఆదివారంనాడు మరణించాడు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు గోదావరి తీరానికి వెళ్లారు. అంత్యక్రియలు నిర్వహించి తిరిగి వస్తున్న జోగయ్య పెద్ద కుమారుడు పుల్లయ్యగా హఠాత్తుగా కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోగానే అతను మరణించాడు.












Click it and Unblock the Notifications