రన్‌వేపై కూలిన మిగ్21 యుద్ధ విమానం, పైలట్ మృతి
జైపూర్: రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్ 21 విమానం కూలింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు. బార్మార్ జిల్లాలోని ఉత్తర్లాయ్ ఎయిర్ బేస్‌లో ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో విమానం కిందకు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సాధారణ శిక్షణళో భాగంగానే లెఫ్టినెంట్ ర్యాంక్ పైలట్ విమానాన్ని తీసుకు వెళ్లారని, కిందకు దిగుతుండగా విమానం రన్ వే పైన కూలిందని జోద్‌పూర్‌లోని రక్షణ మంత్రిత్వ ప్రతినిధి తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాఫ్తుకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో సాధారణ పౌరులు ఎవరు చనిపోలేదన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
కాగా గత నెలలో ఉత్తర్లాయ్ ఎయిర్ బేస్‌లో మిగ్ 21 యుద్ధ విమానం ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications