ఒక్కరు లేకుంటే ఇలా, టైమ్ వస్తే బుద్ధి చెప్పాలి: షర్మిల

పేదలంటే ఆయనకు ప్రేమ అని, ఇప్పుడున్న పాలకులు అసలు ప్రజల గురించి ఆలోచనే చేయడం లేదన్నారు. వైయస్సార్ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అయినా ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరి పక్షాన నిలబడుతుందన్నారు. గుజరాత్‌ను మించేలా ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగన్ తీర్చిదిద్దుతారన్నారు. అందరం సమయం వచ్చినప్పుడు మిగిలిన పార్టీలకు బుద్ధి చెప్పి జగన్‌ను ఆశీర్వదిస్తే సుభిక్ష రాజ్యం వస్తుందన్నారు.
ఈ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. వైయస్ ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలబడాలని అహర్నిషలు తపించారన్నారు.
సోమవారం 210 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చీపురుపల్లి నియోజకవర్గంలోని ఆకులపేట గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి బాగు వలస, వెదుల్ల వలస, వెంకటాపురం ఎక్స్ రోడ్, బిళ్లల వలస మీదుగా గర్భం చేరుకున్నారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.15 గంటలకు చేరుకున్నారు. మొత్తం 16.3 కిలోమీటర్లు నడిచారు.












Click it and Unblock the Notifications