ఫ్లైఓవర్ పైనుండి కారు బోల్తా, ఫోర్త్ క్లాస్ విద్యార్థి సూసైడ్

చితకబాదిన టీచర్
కడప జిల్లా జమ్మలమడుగులోని ఓ పాఠశాలలో ఓ టీచర్ నాలుగేళ్ల చిన్నారిని చితకబాదారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లాలోని ప్రయివేటు పాఠశాల భవనం రెండో అంతస్తు నుండి దూకి నాలుగో తరగతి విద్యార్థి సాయి ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లేపల్లి గ్రామానికి చెందిన సాయి నాలుగు రోజుల క్రితం పాఠశాలలో చేరాడు. గతంలో పాఠశాల నుండి పారిపోయాడని మందలించడంతో మనస్థాపానికి గురైన సాయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఎసిబికి చిక్కిన సూపరింటెండెంట్
వరంగల్ జిల్లా మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
దొంగతనం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న జిటిపి టవర్స్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు అరవై కాసుల బంగారన్ని అపహరించారు.












Click it and Unblock the Notifications