ప్రభుత్వ విధానాలు నచ్చకుంటే ఓటుతో పడగొట్టు: సుప్రీం

ప్రభుత్వం అర్థం లేని విధానాలను అనుసరిక్తే దానికి పరిష్కారం ప్రజల చేతులలోనే ఉందని తెలిపింది. ప్రభుత్వం విధానాలు, తీరు నచ్చకుంటే వచ్చే ఎన్నికలలో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడమే మార్గమమని సూచించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల పైన కోర్టులు తీర్పులివ్వడం సరికాదని పేర్కొంది.
కోర్టులు నియంత్రణ పాటించాలని, ప్రభుత్వ విధాన నిర్ణయాలపై తీర్పుల ద్వారా చట్ట సభల, కార్యనిర్వాహక వ్యవస్థల పరిధిలోకి చొరబడకూడదని, ఆ విధాన నిర్ణయాలు రాజ్యాంగబద్ధమైన చట్టాలకు విరుద్ధంగా ఉన్నప్పుడే కోర్టులు జోక్యం చేసుకోవాలని సూచించింది.
జస్టిస్ సికె ప్రసాద్, జస్టిస్ వి గోపాల గౌడలతో కూడిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం విధానం ప్రజలకు సరిగా అనిపించకుంటే వచ్చే ఎన్నికల్లో దానిని తృణీకరించడమే మార్గమని తెలిపింది.












Click it and Unblock the Notifications