నలుగురు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్: 8 మంది అరెస్టు

arrest
రాంచీ: నలుగురు మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం ఘటనలో జార్ఖండ్ పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తుపాకులతో బెదిరించి బాలికలపై వారు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జార్ఖండ్‌లోని పాకూరు జిల్లా లిట్టిపర పోలీసు స్టేషన్ పరిధిలో గల లబ్డా గ్రామంలో ఈ ఘాతుక సంఘటన జరిగింది.

నలుగురు బాలికలను వసతి గృహం నుంచి 25 మంది సాయుధులు ఆదివారం రాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలను అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి వదిలిపెట్టారు.

ఓ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపడుతుందని ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఎనమిది మందిని అరెస్టు చేశామని, మరొకరిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన డిజిపి రాజీవ్ కుమార్, హోం కార్యదర్శి ఎన్ఎన్ పాండే సమక్షంలో చెప్పారు.

బాలికల విద్యబోధన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, వారికి ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అరెస్టయినవారు సంతల్ పరగనాకు చెందినవారని డిజిపి చెప్పారు. అత్యాచారానికి గురైన బాలికల వయస్సు 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+