రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మృతి, 'కాల్ గర్ల్స్' ముఠా అరెస్ట్

పేకాడ ఆడుతున్న ఇన్‌స్పెక్టర్ అరెస్టు
హైదరాబాదులోని హుమాయున్ నగర్‌లో పేకాట ఆడుతున్న సిఐడి ఇన్‌స్పెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో సహా మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎసిబి వలలో అధికారి
అనంతపురం జిల్లా డి.హిరేహాళ్ మండలం మల్లిశెట్టి గ్రామానికి చెందిన ఓ రైతు నుండి రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఏడిఈ ప్రసాద్ ఎసిబికి చిక్కాడు. వ్యవసాయ పొలానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ సదరు రైతు జనవరిలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఏడిఈ లంచం అడిగాడు.
వ్యభిచార ముఠా అరెస్ట్
కాల్ గర్ల్స్ పేరుతో వెబ్‌సైట్ నిర్వహిస్తున్న వ్యభిచార ముఠాను విశాఖపట్నం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి ల్యాప్‌టాప్, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులు ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. మిగిలిన వారిని పట్టుకుంటామని చెప్పారు.