
'పెళ్లి కాకుండా సహజీవనం చేసినా చట్టం వర్తిస్తుంది'

అలపుఝా జిల్లాలో ఓ వ్యక్తితో సహజీవనం సాగిస్తున్న యువతి హైకోర్టులో గృహ హింస పిటిషన్ దాఖలు చేసింది. సహజీవనం చేస్తే గృహ హింస చట్టం కిందకు రాదని ఆ జంటలోని పురుషుడు వాదించాడు. తమది వివాహం కాదన్నాడు. అయితే అతని వాదనను హైకోర్టు తిప్పికొట్టింది. కలిసి ఉండటం భార్యాభర్తల్లాగే అయినప్పుడు ఈ చట్టం వర్తిస్తుందని తెలిపింది.
ఓడలో భారతీయ నావికులు
టర్కీకి చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ ఓడ పశ్చిమ ఆఫ్రిగా ప్రాంతంలోని గాబస్ వద్ద హైజాక్‌కు గురయింది. ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బంది భారతీయులేనని తెలుస్తోంది. ఎంవి కాటన్ అనే ఈ ఓడను సముద్ర దొంగలు దారి మళ్లించి ఉంటారని భావిస్తున్నారు.
కళంకిత ఎస్పీని తొలగించవచ్చు
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీ వివేక్ దత్‌ను తప్పించేందుకు సిబిఐకి సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చింది.
హసన్ బెయిల్ తిరస్కరణ
మనీ ల్యాండరింగ్ కేసులో హసన్ అలీ బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది.