ఎన్టీఆర్ దూరం: చంద్రబాబుకు కళ్యాణ్ రామ్ చేరువ?

హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకీ తనకూ దూరమైన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ్ రామ్‌ను చేరదీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన బావ మరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కళ్యాణ్ రామ్‌ను చేరదీయడం ద్వారా నందమూరి కుటుంబ సభ్యులు తమ వైపు ఉన్నారని చాటుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ చెమటోడ్చి తీసిన ఓం త్రీడి సినిమాను చంద్రబాబు వీక్షించి, దానికి కితాబు ఇచ్చారు. ఓంను అద్భుతమైన సినిమాగా చంద్రబాబు అభివర్ణించారు. సాధారణంగా సినిమాలకు దూరంగా ఉండే చంద్రబాబు చాలా తక్కువ సందర్భాల్లో సినిమాలు చూసి కితాబులు ఇచ్చారు. తాజాగా, గురువారంనాడు ఆయన ఓం సినిమా చూసి కళ్యాణ్ రామ్‌ను మెచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుందని భావిస్తున్నారు.

Kalyan Ram, Babu and Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీకి దూరంగా ఉంచాలని చంద్రబాబుతో పాటు నందమూరి హీరో బాలకృష్ణ కూడా నిర్ణయించినట్లు సమాచారం. నందమూరి హరికృష్ణ కూడా చంద్రబాబుకు దూరంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య సయోధ్యకు కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఆ సయోధ్య ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.

కళ్యాణ్ రామ్ మొదటి నుంచి చంద్రబాబుకు సన్నిహితంగానే ఉంటున్నారు. అలాగే, మరో నందమూరి హిరో తారకరత్న కూడా చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్దతు ప్రకటిస్తున్నారు. తనను ఆహ్వానించి ఉంటే మహానాడుకు వెళ్లి ఉండేవాడినని జూనియర్ ఎన్టీఆర్ మాటలతో విభేదిస్తూ తారకరత్న ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని, ఒకరు ఆహ్వానించాల్సిన అవసరం లేదని తారకరత్న అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+