'ఇడ్లీ బండి ఉంచుకోవచ్చు, బాంబు పేల్చుతారనుకుంటే'

పుష్పగుచ్ఛంలో రంగు రంగుల పూలుంటేనే అందమని, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి జీవిస్తేనే బాగుంటుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై దేశమంతా ఏకాభిప్రాయం రావాలన్న రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యల పైన కూడా స్పందంచారు.
తన కాలికి నొప్పి వస్తే తానే మందు వేసుకోవాలని, ఎవరో వేసుకుంటే ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. కోర్ కమిటీలో బాంబు పేలుతుందనుకుంటే తుస్ మనిపించారని ఎద్దేవా చేశారు. సాగదీస్తే సాగనంపమని, హుస్సేన్‌సాగర్‌లో ముంచుతామని భారతీయ జనతా పార్టీ నేత ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు.
ఇప్పటిదాకా శాకాహారం (అహింసా మార్గం)లో ఉద్యమించాని, ఇక మాంసాహారం (హింసా మార్గం) ఎంచుకుంటామని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టకపోతే పోరాట రూపం మార్చుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ వచ్చేదాకా జెఏసి ఉంటుందని, వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తుందన్నారు. కాగా, ఈ నెల 25న నిర్వహించే మహాధర్నా సన్నాహాక సమావేశం గురువారం జరిగింది.












Click it and Unblock the Notifications