బొత్సనే నెం.1, ఎవరూ క్రాస్ చేయలేరు: షర్మిల ఎద్దేవా

దానికి షర్మిల కూడా ఘాటుగానే స్పందించారు. మద్యం డాన్‌ను పిసిసి అధ్యక్షుడిగా నియమించడం బాధాకరమన్నారు. బొత్స వంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కాంగ్రెసు బ్రాందీయిజాన్ని అనుసరిస్తోందా? లేక బ్రాందీయిజాన్ని అనుసరిస్తోందా? చెప్పాలన్నారు. షర్మిల పాదయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకూ తూట్లు పొడుస్తోందన్నారు. ఉచిత విద్యుత్‌ను కుదించినందుకు కాంగ్రెసు పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు.
కాంగ్రెసు పాలకులు రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చారన్నారు. ఇలాంటి సర్కారును సాగనంపాల్సింది పోయి.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు.
కాగా పాదయాత్ర 213వ రోజు గురువారం బొబ్బిలి నియోజకవర్గం రొంపిల్లిలో పాదయాత్ర ప్రారంభించిన షర్మిల.. పారాది, సీతారాంపురం, మెట్టవలస, బొబ్బిలి మీదుగా యాత్ర చేశారు. బొబ్బిలిలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తర్వాత లచ్చయ్యపేట మీదుగా యాత్ర చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. గురువారం ఆమె మొత్తం 15.3 కిలో మీటర్లు నడిచారు. దీంతో 2,850.9 కిలో మీటర్ల యాత్ర పూర్తయింది.












Click it and Unblock the Notifications