నో పాలిటిక్స్: అఖిలేష్ రాకతో తలసాని శ్రీనివాస్ హ్యాపీ

అఖిలేష్ యుపి ముఖ్యమంత్రి కాకముందు నుండే తనకు పరిచయముందని చెప్పారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ చర్చ సాగలేదన్నారు. తాను మర్యాద పూర్వకంగానే ఆహ్వానిస్తే ఆయన వచ్చారన్నారు. రాష్ట్ర నేతలతో తాను ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని అఖిలేష్ యాదవ్ కూడా చెప్పారు.
ఎంపీ అనుచరుల హల్‌చల్
కాగా ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ వాహనంలో వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించని విషయం తెలిసిందే. ఈ సమయంలో పలువురు అఖిలేష్ కాన్వాయ్ పై దాడి చేయగా, ఎంపి కాన్వాయ్‌లోని కారు అద్దాలు పగిలాయి.
అఖిలేష్ వెంట వెళ్లేందుకు అంజన్ కుమార్ యాదవ్, ఆయన కుమారుడు అనిల్ యాదవ్‌లు ప్రయత్నించారు. వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఎంపీ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. అనిల్ కూడా హంగామా చేశాడు. మరోవైపు హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ బిజీబిజీగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications