ఎపి యూత్‌కు అఖిలేష్ ప్రశంస, బాబుతో అరగంట భేటీ

ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర యాదవ నాయకులు సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్, టిడిపి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి అఖిలేష్ పార్క్ హయత్ హోటల్‌కు చేరుకున్నారు. ఆయనను పలువురు యాదవ నాయకులు కలిశారు. ఎపి యువతలో ఉత్సాహం, పట్టుదల ఎక్కువగా కనిపిస్తోందన్నారు.
సాయంత్రం ఆరు గంటలకు అఖిలేష్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకున్నారు. కిరణ్ ఆహ్వానం మేరకు తేనీటి విందుకు అఖిలేష్ వెళ్లినట్లు ఎస్పీ నేతలు చెప్పారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సైతం అఖిలేష్‌ను ఆదివారం ఉదయం అల్పాహార విందుకు ఆహ్వానించారు.
అనంతరం శనివారం రాత్రి అఖిలేష్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో అరగంట పాటు భేటీ అయ్యారు. భేటీ అనంతరం అఖిలేష్ మాట్లాడుతూ... మర్యాదపూర్వకంగానే కలిశానని, ఇద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకురాలేదన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తామన్నారు. కాగా అఖిలేష్ ఈ రోజు యాదవ సంఘం మహాసభలో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications