విషాదం: తెలంగాణ కోసం బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయం లో వినోద్ తన చిన్నాన్న ఇంటి వెనుక ఉన్న పశువుల పాకలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వినోద్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే వాడని గ్రామస్థులు తెలిపారు. వినోద్ తల్లిదండ్రులు ఆంజనేయులు, బక్కమ్మ రెండేళ్ల క్రితం ఆర్నెల్ల వ్యవధిలో అనారోగ్యంతో మృతి చెందారు.
దాంతో వినోద్ తన చిన్నాన్నల సహకారంతో మహబూబ్‌నగర్‌లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తిచేశాడు. వినోద్ హైదరాబాద్‌లో తన అత్తమ దగ్గర ఉండేవాడని, చిన్నాన్న గోపాల్ సర్పంచ్‌గా పోటీ చేస్తుండడంతో ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
మధ్యాహ్న భోజనం చేసి వెళ్లాడని, కొద్దిసేపటికే ఆతహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడి బ్యాగును, డైరీనీ, సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications