12 మంది మృతి: రాష్ట్రవ్యాప్తంగా తెరిపిలేని వర్షాలు

ఇప్పటివరకు రాష్ట్రంలో 29% అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. 13 జిల్లాల్లో అధికంగా, 8 జిల్లాల్లో సాధారణ, విశాఖపట్నం, అనంతపురంలలో అత్యల్ప వర్షపాతం నమోదైందని వివరించారు. 53 పునరావా స శిబిరాల్లో 8,360 మంది ఆశ్రయం పొందుతున్నార ని తెలిపారు. రాష్ట్రంలో 5,204 ఇళ్లు దెబ్బతిన్నాయని, 804 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని, 49 చోట్ల రోడ్లు, 294 చెరువులు దెబ్బతిన్నాయన్నారు. చెరువు మరమ్మతుల కోసం జిల్లా కలెక్టర్లకు రూ.10 లక్షల వరకు ఖర్చుచేసే అధికారాలిచ్చామన్నారు.
గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో అత్యవసర సేవల కోసం రెండు హెలికాప్టర్లను, సిబ్బందిని అందుబాటులో ఉంచామని చెప్పారు. పంట మొలకెత్తే దశలో వర్షాలు కురుస్తున్నందున మొలకలు నష్టపోతే విత్తనాలను సబ్సిడీపై అందజేసే నిబంధన ఉందన్నారు. అవసరమైతే ఎరువులను కూడా సరఫరా చేస్తామన్నారు.
భారీ వర్షాలు, వరదల తాకిడికి పలు ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిందని, బాధితులకు సత్వరమే పునరావాస చర్యలను చేపట్టాలని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల్లోని రైతులకు సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలని సోమవారమిక్కడ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల ధాటికి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్‌లతో పాటు కోస్తాలోని ఉభయగోదావరి జిల్లాల్లో వరదలు ముంచెత్తాయని చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో ముందుగా వేసిన పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయని, రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు రాయితీపై వారికి ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయాలని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పలు చోట్ల అవసరమైన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నదని వివరించారు.












Click it and Unblock the Notifications