EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన!

కోట్లాది మంది శ్రామికులు, పాలసీదారులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న దాదాపు రూ. 16,600 కోట్లకు పైగా సొమ్ము.. ఎల్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ సంస్థల్లో ఎలాంటి వినియోగం లేకుండా పేరుకుపోయి ఉంది. సొంతదారులు క్లెయిమ్ చేసుకోకపోవడం, సరైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో ఈ భారీ మొత్తం సంస్థల వద్దే ఉండిపోయింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ ఎంకే విష్ణు ప్రసాద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ ఆసక్తికర గణాంకాలను సభ ముందుంచారు.

ఈపీఎఫ్‌ఓ, ఎల్‌ఐసీల్లో ఎవరి వాటా ఎంత?

కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. EPFOలో దాదాపు రూ.9,330.56 కోట్ల రూపాయిలు..ఇన్-ఆపరేటివ్ ఖాతాల్లో నిలిచిపోయాయి. అయితే ఇవి క్లెయిమ్ చేయని సొమ్ము కాదని, ఖాతాదారులు దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం వల్ల ఇన్-ఆపరేటివ్‌గా మారాయని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

EPFO and LIC Unclaimed Money Centre Reveals Over Rs 16600 Crore Lying Unclaimed in Parliament Reply

ఇక దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (LIC) వద్ద పాలసీదారులకు చెల్లించాల్సిన అసలు, దానిపై వచ్చిన వడ్డీ కలిపి మొత్తం రూ.7,318.50 కోట్లు క్లెయిమ్ కాకుండా ఉండిపోయాయి.

బాధితులకు చేరవేసేందుకు ప్రత్యేక చర్యలు

ఈ అపార నిధులను అసలైన బాధితులకు, వారి నామినీలకు లేదా చట్టబద్ధ వారసులకు అందించడానికి LIC, EPFO సంస్థలు విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. పాలసీదారులు తమ అన్-క్లెయిమ్డ్ డబ్బును సులభంగా వెతుక్కునేందుకు ఎల్‌ఐసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ సెర్చ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనితో పాటు నిరంతరం SMS అలెర్ట్‌లు పంపడం, ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు ఇవ్వడం, ఏజెంట్లు 'బీమా సఖి'ల ద్వారా నేరుగా బాధితులను కలవడం వంటి ప్రచార కార్యక్రమాలను తీవ్రతరం చేసింది.

పదేళ్లు దాటితే ఆ సంక్షేమ నిధికి జమ!

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) నిబంధనల ప్రకారం.. బీమా సంస్థల వద్ద 10 సంవత్సరాలకు పైగా ఎవరూ క్లెయిమ్ చేయకుండా పడిఉన్న నిధులను ప్రతి ఏటా మార్చి 1వ తేదీ కంటే ముందే 'సీనియర్ సిటిజన్ సంక్షేమ నిధి' (SCWF)కి తరలించాల్సి ఉంటుంది.

మరోవైపు ఈపీఎఫ్‌ఓ సంస్థలోని అన్‌క్లెయిమ్‌డ్ ఖాతాల నిధులను ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తప్ప వేరే ఏ ఇతర అవసరాలకు వాడే ఆలోచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీ కుటుంబంలో కూడా పాత EPFO, LIC పాలసీలు ఉంటే, వెంటనే వాటి వివరాలు సరిచూసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+