vastu tips: వాస్తు ప్రకారం సంపద నిలవాలంటే పర్సులో ఇలా చేయండి
రోజుమొత్తం ఎంత కష్టపడి సంపాదించినా.. నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుతున్నారా? ఎంత పొదుపు చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో డబ్బు నీళ్లలా ఖర్చైపోతుందా? అయితే, మీ శ్రమతో పాటు మీరు జేబులో మోసే 'పర్సు' కూడా మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం వాడే పర్సు కేవలం డబ్బులు దాచుకునే సాధనం మాత్రమే కాదు, అది మన ఆర్థిక శ్రేయస్సుకు ప్రతిరూపం. అందులో ఉంచే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తి ని ఆకర్షించి డబ్బు నిలవకుండా చేస్తాయి. ఇంతకీ పర్సులో ఏవి ఉంచకూడదు? సంపదను ఆకర్షించడానికి ఏవి ఉంచాలో ఇప్పుడు చూద్దాం.
పర్సులో పొరపాటున కూడా ఇవి ఉంచకండి!
పాతబడిన, చిరిగిన నోట్లు లేదా విరిగిన నాణేలు పర్సులో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని నమ్ముతారు. ఇవి ఆర్థిక పురోగతికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. చాలామంది ప్రేమానురాగాలతో మరణించిన తమ పెద్దల ఫోటోలను పర్సులో పెట్టుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, మరణించిన వారి చిత్రాలను లేదా కొన్ని రకాల తీవ్ర రూపాల్లో ఉండే దేవుళ్ల ఫోటోలను పర్సులో ఉంచకూడదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని విశ్వసిస్తారు. క్రెడిట్ కార్డ్ స్లిప్‌లు, పాత రసీదులు, పనికిరాని కాగితాలు పర్సులో నింపడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది.

సంపద, సమృద్ధి కలగాలంటే పర్సులో ఏం ఉంచాలి?
లక్ష్మీదేవి ఫోటో లేదా కుబేర యంత్రం ఉంచాలి. సంపదకు అధిదేవత అయిన శ్రీలక్ష్మీదేవి చిన్న చిత్రం లేదా కుబేర యంత్రాన్ని పర్సులో ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. మీ జీవితంలో సాధించాలనుకునే ఆర్థిక లక్ష్యాలు లేదా కోరికలను ఒక చిన్న తెల్లటి కాగితంపై రాసి పర్సులో ఉంచుకోండి. ఇది మీకు సానుకూల ఆలోచనలను, ధనార్జనపై స్పష్టతను ఇస్తుంది.
పర్సు విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు
క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. వారానికి కనీసం ఒక్కసారైనా పర్సును పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేసుకోండి. అవసరం లేని రసీదులు, కాగితాలను వెంటనే పడేయండి. ఒక శుభ్రమైన, పద్ధతిగా ఉన్న పర్సు మన మనస్సులో ఆర్థిక క్రమశిక్షణను పెంచుతుంది. సరైన వాస్తు సూత్రాలు పాటిస్తూ, డబ్బు నిర్వహణపై శ్రద్ధ వహిస్తే ఆర్థిక సమస్యల నుంచి త్వరగానే ఉపశమనం పొందవచ్చు!












Click it and Unblock the Notifications