Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
నీట్ సహా జాతీయ స్దాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యతగా కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 21 రోజుల పాటు ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష చేసి ఆస్పత్రిపాలైన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) కు ఇవాళ ఊరట లభించింది. జంతర్ మంతర్ వద్ద ఆయన్ను రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన పోలీసులు... స్థానిక సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స తీసుకునేందుకు నిరాకరిస్తూ వస్తున్న సోనమ్.. తిరిగి దీక్ష కూడా ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తన భర్త సోనమ్ ను మరో ఆస్పత్రికి మార్చాలని కోరుతూ భార్య గీతాంజలి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సింగిల్ జడ్జి .. ఈ పిటిషన్ ను తోసిపుచ్చారు. దీనిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన గీతాంజలికి ఇవాళ ఊరట దక్కింది. సోనమ్ వాంగ్ చుక్ ను తన ఇష్టమైన ఆస్పత్రిలో చికిత్స పొందేలా ఢిల్లీ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది.
నిరాహార దీక్షలో ఉన్న వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మేదాంత ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాము సోనమ్ ఆందోళనను విస్మరించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

మరోవైపు తన భర్త ఆరోగ్యంపై పరస్పర విరుద్ధమైన నివేదికలు ఇస్తున్న సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి డాక్టర్లపై విమర్శలు గుప్పిస్తూ.. జూలై 19న చేసిన వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇవాళ దానికి కొనసాగింపు మరో పోస్ట్ పెడుతూ.. సోనమ్ వాంగ్‌చుక్‌ను తాము ఎంచుకున్న ఆసుపత్రి అయిన మేదాంతకు డిశ్చార్జ్ చేయడానికి అనుకూలమైన ఉత్తర్వులు జారీ చేసినందుకు ఢిల్లీ హైకోర్టుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ ను మేదాంతకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications