కానిస్టేబుల్ దుశ్చర్య: లేడీ పోలీసుపై అత్యాచారయత్నం

Rape attempt on lady constable in Kadapa district
కడప: కడప జిల్లా కమలాపురంలో మహిళా కానిస్టేబుల్‌పై ప్రవీణ్‌రాజు అనే కానిస్టేబుల్ అత్యాచార యత్నం చేశాడు. కానిస్టేబుల్‌ ప్రవీణ్‌రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహిళా కానిస్టేబుల్‌ ఎన్నికల విధులకు హైదరాబాద్‌ నుంచి అక్కడికి వెళ్లారు. పోలీసులు ప్రవీణ్‌రాజుపై కేసు నమోదు చేశారు.

ఎన్నికల విధులు నిర్వహించేందుకు కడప జిల్లాకు వచ్చిన మహిళా ట్రైనీ కానిస్టేబుల్‌‌పై అతను దురాగతానికి పాల్పడినట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్‌క స్థానిక సరస్వతి కళాశాలలో విధులు కేటాయించారు. కళాశాల పక్కనే ఉన్న ఇంట్లో వసతి కల్పించారు.

ఈ ఇంట్లోకి కానిస్టేబుల్ ప్రవీణ్ రాజు ఆమెను పిలిపించుకుని వెళ్లి అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై లేడీ ట్రైనీ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

విద్యార్థినిపై పిఇటి అసభ్య ప్రవర్తన

విశాఖపట్నం జిల్లాలోని యారాడ బీచ్‌లో ఓ విద్యార్థిని పట్ట పీఈటీ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పీఈటీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

యువకుడిపై యాసిడ్ దాడి

కరీంనగర్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి సమీపంలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. కారులో వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే యువకుడిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+