కుట్ర, ఆ రెండు కుమ్మక్కు: మిడ్డే మీల్ ట్రాజెడీపై నితీష్

Nitish Kumar
పాట్నా: ఛాప్రా జిల్లాలో జరిగిన మధ్యాహ్న భోజనం విషాద ఘటన వెనక కుట్ర ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆ సంఘటన నుంచి ప్రయోజనం పొందడానికి బిజెపి, ఆర్‌జెడి కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. గతవారం శరన్ పాఠశాలలో పెట్టిన ఆహారంలో క్రిమిసంహారక మందులున్నట్లు ఫోరెన్సిక్ లాబొరేటరీ పరీక్షలో తేలిందని, దీన్ని బట్టి కుట్ర జరిగిందనే అనుమామాలు బలపడుతున్నాయని ఆయన అన్నారు.

2014 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జరిగిన జెడియు పార్టీ పార్లమెంటు సభ్యులు, శానససభ్యుల సమావేశంలో ఆయన సోమవారం ప్రసంగించారు. బుద్ధగయ పేలుళ్లు, చాప్రా మీడ్డే మీల్ ట్రాజెడీ తర్వాత బిజెపి, ఆర్‌జెడి ఒక్కటయ్యాయని నితీష్ కుమార్ అన్నట్లు జెడియు అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు.

రెండు సంఘటనల తర్వాత రెండు పార్టీలు ఒకే రోజు బంద్‌కు పిలుపునివ్వడాన్ని బట్టి వాటి మధ్య రహస్య అవగాహన ఉన్నట్లు అర్థమవుతోందని నితీష్ అన్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి మధ్యాహ్న భోజనం ప్రమాదం వంటి సంఘటనలు మరిన్ని జరగవచ్చునని, దీికి పార్టీ నాయకులు సిద్ధపడి ఉండాలని ఆయన అన్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత బిజెపి తీవ్ర నిస్పృహకు లోనైందని, మన ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేయడానికి ఆర్‌జెడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన అన్నారు. తన సహనానికి ఇది పరీక్ష అని, అయితే తాను తన మార్గాన్ని వీడే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+