తెలంగాణ: ప్రధానికి సురవరం లేఖ, ఐలయ్య కొత్తవాదన

కేంద్ర జల మండలి సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన ఉంటే సీమాంధ్ర నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆగస్టు మొదటి వారంలో తెలంగాణపై ప్రకటన వస్తుందని ఆయన ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
తెలుగునాడు ఏర్పాటు చేయండి: ఐలయ్య
రాష్ట్ర విభజన సమస్యను కేంద్రం పరిష్కరించనున్న నేపథ్యంలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. భౌగోళిక అంశాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల జనాభా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కంచె ఐలయ్య కోరుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్‌ను రెండుగా విభజించడం అనివార్యం అయితే కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి పన్నెండు జిల్లాలతో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పన్నెండు జిల్లాలకు తెలుగు నాడు రాష్ట్గంగా పేరు పెట్టాలని సూచించారు. తాను ఇందుకోసం ఉద్యమాన్ని లేవనెత్తుతానన్నారు.












Click it and Unblock the Notifications