వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మాన, సబిత రెడ్డిల కస్టడీ మెమోపై తీర్పు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy and Dharmana Prasad Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల జ్యూడిషియల్ కస్టడీ పిటిషన్ పైన తీర్పు ఆగస్టు 7వ తేదికి వాయిదా పడింది.

సబిత, ధర్మానలను జ్యూడిషియల్ కస్టడీకి పంపాలన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మెమో పైన గురువారం వాదనలు పూర్తయ్యాయి. అనంతరం తీర్పును సిబిఐ కోర్టు వాయిదా వేసింది.

కాగా జగన్ కేసులో ధర్మాన, సబితాల పైన ఛార్జీషీట్ దాఖలు చేసిన సిబిఐ, వారిని జ్యూడిషియల్ కస్టడీకి పంపాలని గతంలో మెమో దాఖలు చేసింది. ఆ మెమోపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు మాజీ మంత్రులను ఆదేశించింది. దీంతో వారు కౌంటర్ దాఖలు చేసిన అనంతరం విచారణ ప్రారంభమైంది.

తమ పేర్లను ఛార్జీషీటులో దాఖలు చేయడంతో మంత్రులుగా ఉన్న వీరు రాజీనామాలు చేశారు. ఆ సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, నిర్దోషులుగా బయటకు వస్తామని చెప్పారు. దీంతో సిబిఐ వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీయంగా పలుకుబడి కలిగినవారని, అధికార వర్గాల్లో ప్రాబల్యం ఉందని, ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయని, వారిని కస్టడీకి తీసుకుంటామని మెమో దాఖలు చేసింది.

English summary
CBI's peition on Former Ministers Dharmana Prasad Rao and Sabitha Indra Reddy custody was postponed to August 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X