తాజ్ మహల్ వద్ద కేంద్రమంత్రి చిరంజీవి 'క్లీన్ ఇండియా'

ఆంధ్రప్రదేశ్‌కు హెరిటేజ్ రాష్ట్రంగా యునెస్కో ద్వారా గుర్తింపు వచ్చేలా ప్రయత్నం చేస్తానని చెప్పారు. దేశంలో 16 రాష్ట్రాలు హెరిటే గుర్తింపును పొందాయన్నారు. ఎపిలో నాలుగు వందల ఏళ్ల నాటి కట్టడాలు ఉన్నాయని చెప్పారు. చిరు తాజ్ మహల్‌ను కలియ తిరిగి నిర్మాణ విశేషాలు, సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.
గత 2012 జూన్‌లో ఢిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద తొలిసారి ఈ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు కింద చేర్చిన రెండో వారసత్వ కేంద్రం తాజ్ మహల్. భారత్‌కు అత్యధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశ్యంతో కార్పోరేట్ సంస్థల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పర్యాటక కేంద్రాల వద్ద పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జిసి తాజ్ మహల్‌ను దత్తత తీసుకుంది. ఇక నుంచి ఓఎన్‌జిసి తాజ్ మహల్‌కు వచ్చే పర్యాటకులకు వసతులు కల్పించి, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. కేంద్ర పురవాస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగే క్లీన్ ఇండియా కార్యక్రమాలకు అయ్యే ఖర్చును ఆ సంస్థే భరిస్తుంది.












Click it and Unblock the Notifications