వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం ఆగేది లేదు, బాబు ఏం చేస్తారో: టిపై సబ్బం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Sabbam Hari
విశాఖ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుందని తాను ఇన్నాళ్లు ఆగానని, ఇక జగన్ కోసం ఆగే పరిస్థితి కనిపించడం లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సోమవారం అన్నారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి విశాఖలోని ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన తాను రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని కోరుకునే వాళ్లలో మొదటి వ్యక్తిని అన్నారు.

జగన్‌ను ఇబ్బంది పెట్టవద్దని ఇన్నాళ్లు ఆగామని, ఆయన ఆడిస్తున్న నాటకంగా అందరూ ఆరోపిస్తారని ఊరుకున్నానని, విభజన ప్రక్రియ జరుగుతుంటే తమ నిర్ణయం చెప్పే రోజు వచ్చిందన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. సమైక్యానికి అనుకూలంగా ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తాను ఉంటానని చెప్పారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ నిర్ణయాలను స్పష్టంగా చెప్పక పోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది కాంగ్రెసు పార్టీయేనని మండిపడ్డారు. కాంగ్రెసుది నాటకోమో లేదా తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ లాంటి వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

కాంగ్రెసు ఏ నిర్ణయం తీసుకోదని, మౌనంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు ఆదేశించినట్లుగా తెలుస్తోందన్నారు. తెలంగాణ ఇస్తే జగన్ ఏం చేస్తారో చూడాలన్నారు. కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వంటి నేతలకు ప్రజలతో సంబంధాలు అలాంటి వారే, చిదంబరం వచ్చేసారి గెలుస్తారో లేదోనని, అలాంటి నేతలు రాష్ట్రాన్ని విభజించాలనుకుంటున్నారని మండిపడ్డారు.

English summary

 Anakapalli MP and YSR Congress Party chief YS Jaganmohan Reddy's group leader Sabbam Hari said on Monday that he will fight for United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X