రామ్‌చరణ్‌కు జస్పీత్ బుమ్రా కౌంటర్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన గ్రాండ్ మ్యూజిక్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అది సినిమా పాటల కంటే కూడా.. రామ్ చరణ్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్లే కావడం గమనార్హం.

బుమ్రాను ఫుట్ బాల్ ప్లేయర్ అన్నాడు

భోపాల్ ఈవెంట్‌లో హోస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రామ్ చరణ్ చిన్న పొరపాటు చేశారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఆయన పొరపాటున 'ఫుట్‌బాల్ ప్లేయర్' అని సంబోధించారు. క్రికెట్ నేపథ్యంలో వస్తున్న 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో ఉంటూ.. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్‌ను ఫుట్‌బాల్ ప్లేయర్ అనడంతో నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. చరణ్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను గమనించిన రామ్ చరణ్ వెంటనే స్పందించారు. తనకు పేర్లు, వ్యక్తుల రంగాలు ఒక్కోసారి ఠక్కున గుర్తురావు అని, అది కేవలం మానవ సహజమైన పొరపాటు మాత్రమేనని పేర్కొన్నారు. జస్ప్రీత్ బుమ్రా అంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం ఉందని చెబుతూ.. తన పొరపాటుకు చాలా హుందాగా క్షమాపణలు కోరారు.

Peddi Event Sparks Meme Fest After Ram Charan Mistakenly Calls Jasprit Bumrah a Football Player

వెల్లువెత్తిన మీమ్స్

రామ్ చరణ్ క్షమాపణలు చెప్పి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టినప్పటికీ, మీమర్స్ మాత్రం ఊరుకోలేదు. చరణ్ చేసిన కామెంట్‌కు బుమ్రా కౌంటర్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. రామ్ చరణ్ ఫోటోను షేర్ చేస్తూ.. "నో ప్రాబ్లం యశ్ భాయ్.. నేను మీ పెద్ద ఫ్యాన్‌ని. మీ 'టాక్సిక్' సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రాసి ఉన్న ఒక స్క్రీన్ షాట్ వైరల్‌గా మారింది. అంటే.. రామ్ చరణ్ ను కన్నడ స్టార్ యశ్‌గా, చరణ్ చేస్తున్న 'పెద్ది' సినిమాను యశ్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాగా బుమ్రా తప్పుగా పేర్కొంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చాడనేది ఆ పోస్ట్ సారాంశం.

బుమ్రా అలాంటిది చేయలేదు

నిజానికి జస్ప్రీత్ బుమ్రా అలాంటి పోస్ట్ ఏదీ పెట్టలేదు. రామ్ చరణ్ వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి అసహనం కూడా వ్యక్తం చేయలేదు. చరణ్‌పై కౌంటర్లు వేయడానికి కొందరు క్రియేటివ్ ఫ్యాన్స్, మీమర్స్ కలిసి సృష్టించిన ఫేక్ పోస్ట్ ఇది. బుమ్రా దీనితో సంబంధం లేకపోయినా, ఈ 'టాక్సిక్' మీమ్ మాత్రం ప్రస్తుతం ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో తెగ ట్రెండ్ అవుతోంది. ఏదేమైనా, ఒక చిన్న పొరపాటును చరణ్ స్పోర్టివ్‌గా తీసుకుని సారీ చెప్పడం, దాన్ని మీమర్స్ తమదైన శైలిలో మరింత ఫన్నీగా మార్చేయడంతో జూన్ 4న రాబోతున్న 'పెద్ది' సినిమాకు భోపాల్ ఈవెంట్ ద్వారా ఊహించని రేంజ్ లో ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+