వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే తెలంగాణపై నిర్ణయం, కట్టుబడి ఉన్నాం: దిగ్విజయ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై రేపు తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. సోమవారం ఓ జాతీయ మీడియా చానెల్ ప్రతినిధితో మాట్లాడారు. సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

నాయకులంతా పార్టీ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన వల్ల తమ పార్టీ గెలుస్తుందా, లేదా అనేది ముఖ్యం కాదని, తాము తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తామని, జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దాన్ని అమలు చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు

తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన విషయం కాదని, దాదాపు 12, 13 ఏళ్లు సంప్రదింపులు జరిపామని, సంప్రదింపులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇస్తుందని అనుకుంటున్నట్లు అజిత్ సింగ్ అన్నారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కుతుందని ఆయన అన్నారు.

కాగా, తెలంగాణపై రేపు సాయంత్రం జరిగే కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. సిడబ్ల్యుసి సమావేశానికి ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో సమావేశమై, తెలంగాణపై తీసుకుని నిర్ణయాన్ని తెలియజేస్తారు. అయితే, సిడబ్ల్యుసి ఎజెండా తనకు తెలియదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

English summary
Ahead of the Congress Working Committee meeting on Tuesday, senior party leader Digvijay Singh on Monday said that a decision on bifurcating Andhra Pradesh to create Telangana will be taken at the meet. However, Digvijay clarified that the he was not aware about the agenda of CWC meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X