వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటోలు: తెలంగాణ పోరులో ముఖ్య ఘట్టాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ప్ర్తత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం గత పదిహేనేళ్ల పాటు ఉధృతంగా సాగింది. హైదరాబాదులోని అశోకా థియేటర్‌లో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆప్ ఎక్స్‌ప్రెషన్ అనే సంస్థ ఏర్పాటు చేసిన అన్ని వర్గాల సమావేశంతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ ఉధృతి ఇప్పటి వరకు కొనసాగింది. మేధావులు, రచయితల నుంచి, తెలంగాణ మహాసభ నుంచి ప్రారంభమైన ఉద్యమం కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఏర్పాటు చేయడంతో మరో రూపం తీసుకుంది.

తెరాస ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం జాతీయ స్థాయికి పాకింది. తెలంగాణ రాజకీయ నేతలు అనివార్యంగా ఉద్యమంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటివారు దీనికి పూర్వరంగాన్ని తయారు చేసి పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో స్వీప్ చేసింది. ఈ ఊపును చూసిన కాంగ్రెసు పార్టీ 2004 ఎన్నికల్లో తెరాసతో పొత్తు పెట్టుకుంది.

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెరాస అధ్యక్షుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనను అరెస్టు చేసి ఖమ్మం ఆస్పత్రికి, ఆ తర్వాత హైదరాబాదులోని నిమ్స్‌కు తరలించారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చిదంబరం ప్రకటించడంతో ఆయన దీక్షను విరమించుకున్నారు.

జగన్‌కు చుక్కెదురు..

జగన్‌కు చుక్కెదురు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్న తర్వాత వివిధ రూపాల్లో తెలంగాణ ఉద్యమం నడిచింది. వరంగల్ జిల్లాలో వైయస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆయనను మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేశారు

తెలంగాణ మార్చ్..

తెలంగాణ మార్చ్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో తెలంగాణ జెఎసి తెలంగాణ మార్చ్ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై చేపట్టింది. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పిన కొందరు ప్రముఖుల విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

జోరు పెంచిన బిజెపి

జోరు పెంచిన బిజెపి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో బిజెపి జోరు పెంచింది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పోరు యాత్ర చేశారు. ఆయనకు కూడా మంచి స్పందన లభించింది.

కార్యరంగంలోకి నారాయణ

కార్యరంగంలోకి నారాయణ

తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సిపిఐ చాలా కాలం ఉద్యమానికి దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత తెలంగాణ పోరులోకి తీసుకుంది. సీమాంధ్రకు చెందిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలంగాణలో తెలంగాణ ప్రజా పోరు యాత్ర చేశారు.

సహాయ నిరాకరణ..

సహాయ నిరాకరణ..

తెలంగాణ డిమాండ్‌తో ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేపట్టారు. ఉద్యోగులు తెలంగాణ డిమాండ్‌తో జరిగిన ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచారు. స్వామి గౌడ్, శ్రీనివాస గౌడ్, దేవీ ప్రసాద్ వంటి ప్రభుత్వోద్యోగ సంఘాల నాయకులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రభుత్వోద్యోగులు చేపట్టిన సకల జనుల సమ్మె దాదాపు 454 రోజుల పాటు నడిచింది.

వంటావార్పూ ఇలా..

వంటావార్పూ ఇలా..

తెలంగాణ డిమాండ్‌తో వినూత్నమైన నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వంటావార్పూ వంటి కార్యక్రమాలను చేపట్టారు. కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో వంటావార్పూ కార్యక్రమంలో పాల్గొన్నారు. రోడ్లపై వంటావార్పూ చేపట్టి రోడ్లను దిగ్బంధం చేశారు.

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల గర్ఝన..

ఉస్మానియా, కాకతీయ విద్యార్థుల గర్ఝన..

కెసిఆర్ ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ విద్యార్థులు జోష్ పెంచారు. ముఖ్యంగా హైదరాబాదులోని ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణ ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. పలుమార్లు ఆ విశ్వవిద్యాలయాలు ఉద్రిక్తంగా మారాయి. విశ్వవిద్యాలయంలో విద్యార్థి గర్జన వంటి కార్యక్రమాలను చేపట్టాయి.

కాళ్లు కూడా పట్టుకున్నారు..

కాళ్లు కూడా పట్టుకున్నారు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పలు కార్యక్రమాల ద్వారా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించడానికి పూనుకున్నారు. వారిని బయటకు రాకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చారు. ఈ స్థితిలో విద్యార్థులు వినూత్నమైన కార్యక్రమాలకు కూడా సిద్ధపడ్డారు.

సాగర హారం ఇలా..

సాగర హారం ఇలా..

తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో సాగర హారం కార్యక్రమం జరిగింది. హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులతో పాటు కాంగ్రెసు తెలంగాణ నేతలు కూడా పాల్గొన్నారు. తెలంగాణ జెఎసిని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కోదండరామ్ ముందుండి నడిపించారు.

విద్యార్థుల ఆత్మహత్యలు

విద్యార్థుల ఆత్మహత్యలు

తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇషాంత్ రెడ్డి, యాదయ్య, వేణు వంటి విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. దాదాపు 900 మంది ఆత్మహత్యలు చేసుకుని ఉంటారని ఓ అంచనా.

నడుస్తున్న కాలంలో గద్దర్

నడుస్తున్న కాలంలో గద్దర్

పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తెలంగాణ కోసం రంగంలోకి దిగిన గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పడింది. నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ముందు ఆయన నల్లగొండ జిల్లా భువనగిరిలో, వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు ప్రజలు పోటెత్తారు

తెలంగాణకు సంబంధించి తప్పించుకోవడానికి వీలైన ఒప్పందాన్ని తెరాసతో చేసుకుంది. తెలంగాణ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చింది. ఆ తర్వాత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెసు ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాల్లో తెరాస కూడా పాలు పంచుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు కాంగ్రెసు వైఖరిని నిరసిస్తూ బయటకు వచ్చింది. ఈ క్రమంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కరీంనగర్ లోకసభ స్థానానికి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ అంశంపై పార్టీ వైఖరితో విభేదిస్తూ నాయకులు బయటకు రాసాగారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెరాసతో పొత్తు పెట్టుకుంది. అయితే, తెరాస సీట్లు తగ్గిపోగా, తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. తిరిగి కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి తెరాసను నిర్వీర్యం చేసే పనికి పూనుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వివిధ రూపాల్లో తగ్గించే ప్రయత్నాలు చేశారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీని పర్యవసానంగా రాత్రికి రాత్రి అప్పటి హోం మంత్రి పి. చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించారు. అయితే, దానికి పరిణామాలు ఎదురు తిరిగాయి. సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. దీంతో 23వ తేదీన ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీని వేసింది. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలను సూచించింది. కాంగ్రెసు ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వచ్చింది. చివరకు 2013 జులై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కచ్చితమైన నిర్ణయం తీసుకుంది.

English summary
The present movement for seperate Telangana state is having about 15 years history. Telangana Rastra Samithi (TRS) president K chandrasekhar Rao indifinate hunger strike, following Chidambaram statement ignited the movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X