వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఏర్పాటు: ఎవరేమన్నారు, రిజైన్లు, బంద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: అరవయ్యేళ్ల తెలంగాణ ఉద్యమానికి ఫలితం మంగళవారం జూలై 29, 2013న ఫలితం వచ్చింది! తెలంగాణ ఏర్పాటుకు యూపిఏ, కాంగ్రెసు పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో తెలంగాణలో సంబరాలు జరుపుకుంటున్నారు. అదే సమయంలో సీమాంధ్రలో ఉద్యమం మరింత వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెసు పార్టీ ప్రకటనపై ఎవరేమేన్నారు....

అద్వానీ

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రజల మనోభావాలను గౌరవించడమేనని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ అన్నారు. భాగస్వామ్య పక్షాల వల్ల గతంలో నిర్ణయం తీసుకోలేకపోయామని, వాస్తవానికి తెలంగాణ ఎప్పుడో ఏర్పడి ఉండాల్సిందన్నారు.

ప్రకాశ్ జవదేకర్

వర్షాకాల సమావేశంలోనే తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. బిజెపి మొదటి నుండి తెలంగాణ కోసం ఉద్యమిస్తోందన్నారు.

Telangana

జానా రెడ్డి

ప్రత్యేక రాష్ట్రం కోసం 1956 నుండి అనేక మంతి ఎన్నో త్యాగాలు చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం తాము పద్నాలుగేళ్లుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తులు అందజేశామన్నారు. ప్ర్తత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేసిన నాయకులకు, పార్టీలకు, తెలంగాణవాదులకు కృతజ్ఞతలు చెప్పారు. ఆలస్యమైనా చారిత్రక నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ రోజు చాలా శుభదినమని, 56 ఏళ్ల కల నెరవేరిందన్నారు. తెలంగాణేతరులకు భద్రత ఉంటుందన్నారు.

దామోదర రాజనర్సింహ

రాష్ట్రం ప్రకటించినందుకు సిడబ్ల్యూసికి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, యుపిఏకు ధన్యావాదాలు అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమేమీ కాదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది చారిత్రాత్మకమైన రోజు అన్నారు. 56 ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ అన్నారు.

కెసిఆర్

హైదరాబాదులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారని, ఎవరికీ అభద్రతా భావం అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

కోదండరామ్

తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులైన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. కీలక నిర్ణయం దాటామన్నారు. తెలంగాణ బిల్లు పాసయ్యాక సంబరాలు జరుపుకుందామన్నారు.

నారాయణ

తెలంగాణపై యూపిఏ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. డిసెంబర్ 9 ప్రకటన మరోసారి పునరావృతం కావొద్దన్నారు.

సబిత, బలరాం కృతజ్ఞతలు

తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, కేంద్రమంత్రి బలరాం నాయక్‌లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రకటన సాధించినట్లే... ప్రక్రియ అమలుకు కూడా ఒత్తిడి తెద్దామన్నారు. ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకున్నారని బలరాం నాయక్ అన్నారు.

కిషన్ రెడ్డి

కాంగ్రెసు పార్టీ మోసపూరిత వైఖరి కారణంగానే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడిన సుష్మా స్వరాజ్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరన్నారు. తమది ఏ ఎండకాడుగు పట్టే పార్టీ కాదన్నారు. సీమాంధ్రలో జై తెలంగాణ.. జై ఆంధ్ర అన్న తమ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు అన్నారు. కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ ప్రజలు, మోడీ నిర్ణయం వచ్చేలా చేశారన్నారు.

ఉమ్మడి రాజధాని విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, ఎన్ని రోజుల్లో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారో చెప్పాలన్నారు. ఆ తర్వాత తాము స్పందిస్తామన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెలలో రాష్ట్రానికి వచ్చి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతారని భావించిన కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెసు ఓట్లు సీట్లతో తెలంగాణను ముడిపెట్టిందని, తాము అలా కాదన్నారు.

ఇన్నేళ్ల ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు, యువకులు చనిపోతే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు మెదపలేదని, ఇప్పుడు బిజెపికి నేత మోడీకి భయపడి నిర్ణయం తీసుకుందన్నారు.

దేవీ ప్రసాద్

తెలంగాణ విజయం అమరవీరులు, ఉద్యమకారులదేనని టిఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెసుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో హైదరాబాద్ పౌర సేవా సమితిని ఏర్పాటు చేసి 24 గంటలు పని చేసేలా కృషి చేస్తామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణపై యుపిఏ ప్రకటన పట్ల తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు హర్షం వ్యక్తం చేశారు.

కెటిఆర్

తెలంగాణపై కాంగ్రెసు పార్టీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు సిరిసిల్ల తెరాస శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు చెప్పారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

జెసి దివాకర్ రెడ్డి

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో సీమాంధ్ర నేతలు విఫలమయ్యారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి అన్నారు. మరో రెండు రోజుల్లో హైదరాబాదులో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామన్నారు.

రుద్రరాజు పద్మరాజు

తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తూ సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని, పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం కాబట్టి తాము ఈ కఠిన నిర్ణయాన్ని సహిస్తున్నామని కాంగ్రెసు పార్టీ విప్ రుద్రరాజు పద్మరాజు అన్నారు.

దూళిపాళ్ల నరేంద్ర

ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలుగుదేశం పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తమ పదవులకు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తేనే నిర్ణయం ఆగుతుందన్నారు.

రాజీనామాలు....

తులసి రెడ్డి రాజీనామా

తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏడు సూత్రాల అమలు పథకం కమిటీ చైర్మన్ తులసి రెడ్డి తన రాజీనామా లేఖ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల ఇందిరా గాంధీ ఆత్మ క్షోభిస్తోందన్నారు. సిడబ్ల్యూసిది ఉన్మాద చర్య అన్నారు.

ఆదినారాయణ రెడ్డి

తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేశానని, ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నానని కడప జిల్లా కాంగ్రెసు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు.

పొన్నాడ సతీష్ కుమార్

విభజన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఆయన కాంగ్రెసు పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.

సికె బాబు ఆందోళన

చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే సికె బాబు గాంధీ సర్కిల్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.

బంద్....

కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి బుధవారం సీమాంధ్ర బందుకు పిలుపునిచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్యవాదులు క్రొవ్వత్తులతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం వద్ద విద్యార్థులు ర్యాలీ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. పదమూడు జిల్లాల్లో ఆందోళనకు సమైక్యాంధ్ర జెఏసి సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ చిత్రాలను అడ్డుకుంటామని, కావూరి సాంబశివ రావును జిల్లాకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమవుతున్నారు.

English summary
The UPA coordination committee and Congress working 
 
 committee have endorsed a separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X