'జానా, జైపాల్‌లకు నో: రాజనర్సింహే తెలంగాణ సిఎం'

తెలంగాణ కోసం నిస్వార్థంగా పోరాడి ఎందరో తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటే, సెంటిమెంటును అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం ఆస్తులు గడించిందని ప్రజా సంఘాల ఐకాస నేత గజ్జెల కాంతం ఆరోపించారు. కాంగ్రెసు కెసిఆర్ కుటుంబాన్ని పిలువకుండా తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటించడం హర్షణీయమన్నారు. తెలంగాణ నాయకత్వ బాధ్యతలను బడుగు బలహీన వర్గాలు చేపట్టే అవకాశముందని తెలిసి కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నారన్నారు.
అమరవీరుల విజయం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ, యూపిఏ భాగస్వామ్య పక్షాలు నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయ విజయం తెలంగాణ అమరవీరులు, నిరంతరం పాటుపడుతున్న ఉద్యమ శక్తులదేనని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటే వెయ్యి మంది విద్యార్ధులు, యువకుల మరణాలు ముందుకొచ్చేవికావన్నారు. ఇది విజయంలో విషాదంగా ఆయన అభివర్ణించారు.
సీమాంధ్ర రాజకీయ నేతలు తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ శత్రుత్వ భావంతో చూడటం సరైందికాదని, ఒకనాడు కలిసిన ప్రాంతమే, నేడు విడిపోయిందని, దీన్ని సహృదయంతో అర్దం చేసుకొని మిగతా ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ ఏర్పాటును నిరసించకుండా, ప్రత్యేక రాష్ట్రం కోసం మరణించిన రెండువేల మంది అమరులను తలుచుకొని సహకరించాలని, ఆందోళనలకు దూరంగా ఉండాలని కోరారు.
సానుకూల వైఖరిపై సిపిఐ హర్షం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సుదీర్ఘ పోరాటానికి ఫలితం వస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధిష్ఠానం ఆలస్యం చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల వైఖరి తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అదే సందర్భంలో కోస్తా, రాయలసీమ ప్రజలోల ఉన్న అనుమానాలు నివృత్తిపరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications