జగన్‌కు కూన శ్రీశైలం షాక్!: పాతగూటికే కొండా సురేఖ

కూన శ్రీశైలం గౌడ్ మూడు నాలుగు నెలల క్రితమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో చాలా సాన్నిహిత్యం ఉండేది. ఈ నేపథ్యంలో జగన్ పార్టీ స్థాపించిన తొలి నాళ్లలోనే ఆయన ఆ పార్టీలోకి వెళ్తారని భావించారు. కానీ ఇటీవల జైలులో జగన్‌ను కలిసి పచ్చజెండా ఊపారు.
అయితే ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ ఉందనే అభిప్రాయం ప్రజల్లోకి జోరుగా వెళ్లింది. ఆ కారణంగానే పలువురు తెలంగాణ ప్రాంత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో కూన కూడా అదే దారిలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డితో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు కొండా సురేఖ కూడా కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని సమాచారం. కొద్ది రోజుల కింద కొండా దంపతులు బిజెపిలోకి చేరుతారనే ప్రచారం సాగింది. వారితో ఆ పార్టీ నేతలు చర్చలు కూడా జరిపారట. అయితే ఇప్పుడు కాంగ్రెసు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వారు మరోసారి యూ టర్న్ తీసుకొని కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని అంటున్నారు. వారికి మాజీ పిసిసి చీఫ్ డి శ్రీనివాస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి రాజకీయ గురువు ఆయనే.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications