రెండ్రోజులుగా తిన్లేదు: టిపై కన్నీరుకార్చిన లక్ష్మీపార్వతి

గతంలో టాంక్ బండ్ పైన ఉన్న మహానుభావుల విగ్రహాలను కొందరు పడగొట్టారని గుర్తు చేశారు. అలాంటి మహానుభావుల విగ్రహాలను పడగొట్టిన వారు రాష్ట్రం వచ్చాక ఏమైనా చేస్తారన్నారు. తన భర్త సమాధి రాష్ట్రం విడిపోయాక ఏమవుతుందోననే ఆందోళన తనకు ఉందన్నారు. రెండు రోజులుగా తాను అన్నం కూడా తినలేదని కన్నీరుకార్చుతూ చెప్పారు. రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీల నిర్లక్ష్యపు ధోరణే ప్రధాన కారణమని మండిపడ్డారు.
పునఃసమీక్షించుకోమని చెప్తాం: పార్థసారథి
తెలంగాణపై నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని తాము కేంద్రం, పార్టీ అధిష్టాన్ని కోరుతామని మంత్రి పార్థసారథి వేరుగా అన్నారు. రాజీనామా చేయాలని తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఏ నిర్ణయమైనా అందరం కలిసి తీసుకుంటామని చెప్పారు. సీమాంధ్ర నేతలం అందరు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు.
స్పందించాలి: ముద్రగడ
సీమాంధ్ర యువకుల ఆందోళనపట్ల కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ స్పందించాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. తెలంగాణ వారి పట్ల ఎలా స్పందించిందో సీమాంధ్రుల పట్ల కూడా అలాగే స్పందించాలన్నారు. కొత్త రాష్ట్రం ఉనికిలోకి వచ్చిన రోజునే సీమాంధ్రలో రాజధానికి శంకుస్థాపన చేయాలన్నారు. కేంద్రమే వ్యయం భరించాలన్నారు. హైదరాబాదుతో సమానంగా మౌలికా వసతులు కల్పించాలని కోరారు.












Click it and Unblock the Notifications