6 నెలల్లో పూర్తి: టిపై షిండే, హైద్రాబాద్‌పై ప్రశ్న దాటవేత

సాధారణంగా రాష్ట్ర ఏర్పాటుకు ఎనిమిది నెలలు పడుతుందని, తాము ఐదారు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమనైతే ఇంకా ముందే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కేబినెట్ నోట్ పూర్తయిన తర్వాత తెలంగాణపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణ కోసం సిడబ్ల్యుసి మార్గ నిర్దేశనం చేసిందని, దాని ప్రకారం హోంమంత్రిత్వ శాఖ వెళ్తుందన్నారు. కేబినెట్ నోట్‌ను రాష్ట్రపతికి పంపిస్తామన్నారు.
విదర్భనే కాకుండా దేశంలో చాలాచోట్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఉన్నాయన్నారు. తెలంగాణ చాలా ఏళ్లుగా పెండింగులో ఉందన్నారు. విదర్భ కంటే ముందే తెలంగాణ ఉందన్నారు. కొత్త రాష్ట్రాల కోసం ఆందోళన చేసే వారు ప్రజాస్వామ్యయుతంగా చేసుకోవచ్చునన్నారు. తమ ముందుకు వచ్చే అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు, ఈశాన్య రాష్ట్రాల్లో నాలుగైదు చోట్ల ప్రత్యేక ఉద్యమాలున్నాయన్నారు.
చిన్న రాష్ట్రాల వల్ల నక్సలిజం పెరుగుతుందన్న అభిప్రాయం తమకు లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలపై సందర్భోచితంగా స్పందిస్తామన్నారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్న సీమాంధ్రుల డిమాండు పైన తాము స్పందిస్తామన్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసే రాష్ట్రాలకు భాష ఓ ప్రాతిపదిక కాదన్నారు.
హైదరాబాదు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. కాగా హైదరాబాదును భవిష్యత్తులో యూటిగా చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విధివిధానాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుపై నోట్ సిద్దమైనప్పుడు హైదరాబాద్ పైన మరింత స్పష్టత వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications