విభజనపై చెప్పా, వెల్లడించలేను: కిశోర్ చంద్రదేవ్

రాష్ట్ర విభజన విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అందరినీ సంప్రదించిన తర్వాతనే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తాను అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించబోనని ఆయన చెప్పారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మంచివి కావని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. హింస, బ్లాక్ మెయిల్ సరి కావని ఆయన అన్నారు. పార్టీ రాజీనామా చేసి ఆ పని చేయాల్సి ఉండిందని కిశోర్ చంద్రదేవ్ అన్నారు. హింసను ప్రోత్సహిస్తే మనకే నష్టం జరుగుతుందని, ఆ భారం ప్రజలపైనే పడుతుందని ఆయన అన్నారు.
ఉద్రిక్తతల కారణంగానే రాజీనామాలు
సీమాంధ్రలో ఉద్రిక్తతల కారణంగా ప్రజాప్రతినిధులు రాజీమానాలు చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం రెండుగా విడిపోతే రెండు రాష్ట్రాల్లోనూ అద్బుత ప్రగతి ఉంటుందని. సీమాంధ్రకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామని సోనియా తనతో అన్నారని వివరించారు. ఈ నిధులతో సీమాంధ్రను సువిశాలంగా, అభివృద్ధి పథంలో నడిపించవచ్చని అన్నారు.
దొంగే దొంగ అన్నట్లుగా...
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన సీమాంధ్ర నేతలు ఇప్పుడెందుకు రాజీనామాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలు అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లు ఉన్నదని నారాయణ విమర్శించారు. అధికార పార్టీ నేతలే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్రలో ప్రజలు సంయమనంగా ఉండేందుకు తమ పార్టీ కృషి చేస్తోందని నారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications