ఇందిరా, రాజీవ్ విగ్రహాల ధ్వంసం సరి కాదు: కెవిపి

KVP
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాను గౌరవిస్తున్నానని, అయితే మహా జాతీయ నాయకులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం తనను దిగ్భ్రాంతికి గురి చేస్తోందని కాంగ్రెసు రాజ్యసభ సభ్యుకు డాక్టర్ కెవిపి రామచంద్ర రావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. అసాంఘిక శక్తులు, విచ్ఛిన్నకర రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం ప్రభావానికి లోను కావద్దని ఆయన ప్రజలను కోరారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలని ఇందిరా గాంధీ భావించారని, 1969, 1972 చెలరేగిన బలమైన, హింసాత్మక ఉద్యమాల తర్వాత కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి ఇందిరా గాంధీ కారణమని ఆయన అన్నారు. దేశం కోసం రాజీవ్ గాంధీ చాలా పన్ని వయస్సులోనే ప్రాణ త్యాగం చేశారని ఆయన గుర్తు చేశారు. మరణం తర్వాత కూడా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్ఫుర్తి ప్రదాతలుగా నిలిచారని ఆయన అన్నారు.

దేశం కోసం త్యాగాలు చేసిన మన జాతీయ నేతల స్మారకాలను రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని స్వార్థపర శక్తులు అమాయక ప్రజలు లక్ష్యం చేసుకునే విధంగా రెచ్చగొడుతున్నాయని ఆయన విమర్శించారు. అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఉద్వేగాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రజాతంత్ర పద్ధతిలో మన భావవ్యక్తీకరణ ఉంటే గౌరవిస్తారని, ఉద్యమాలూ ప్రదర్శనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని ఆయన అన్నారు. దేశ గౌరవానికి భంగం కలిగించే చట్ట వ్యతిరేక శక్తుల చేతిలో పనిముట్లుగా మారకూడదని ఆయన సూచించారు.

కాంగ్రెసు పార్టీ మాత్రమే ప్రజాస్వామిక సూత్రాలను చిత్తశుద్ధితో తూచా తప్పకుండా పాటిస్తోందని, ఒక దేశం ఒక కుటుంబం అనే నినాదంతో పనిచేస్తోందని కెవిపి అన్నారు. దిష్టిబొమ్మల దగ్ధం మహా నాయకుల అభిమానుల మనోభావాలను దెబ్బ తీస్తాయని ఆయన అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్ మన దేశానికి దిశానిర్దేశం చేశారని చెప్పారు.

రాష్ట్రాన్ని విభజించాలనే కాంగ్రెసు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఉద్యమాలను, ప్రజల మనోభావాలను తాను ఖండించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మనోభావాలను, బాధను, ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకుంటానని, ఆరు దశాబ్దాల తర్వాత కుటుంబం చీలిపోయిన భావన కలగడం సహజమని ఆయన అన్నారు. తన తరఫున, తన సహచరుల తరఫున తాను ఆందోళన చేస్తున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, తమను తాము బాధపెట్టుకోవద్దని, చట్టాన్ని గౌరవించే దేశ పౌరులుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించకూడదని ఆయన అన్నారు. లక్ష్యాన్ని సాధించే వరకు మన ఆగ్రహాన్ని, అసంతృప్తిని ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తీకరిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+