వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు పార్టీ దొంగలే: వివేకా, సిఎంకూ రాదు: పయ్యావుల

By Pratap
|
Google Oneindia TeluguNews

anam vivekananda reddy and payyavula keshav
హైదరాబాద్: ఎపి ఎన్టీవోలు తలచుకుంటే ముఖ్యమంత్రికి కూడా జీతం రాదని తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమానికి పయ్యావుల మద్దతు ప్రకటించారు. సీమాంద్రులను కడుపులో పెట్టుకోవడం అంటే హైదరాబాద్ నుంచి తరిమేయడమేనా అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

తెలుగు దేశం పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీమాంధ్రులకు కూడా భరోసా ఇవ్వాలని ఆయన ఢిల్లీలో శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్ తెలంగాణ జాగీర్ కాదని ఆయన అన్నారు.

సీమాంధ్రలో ఆందోళనకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఒక పార్టీకి చెందిన దిగ్విజయ్ సింగ్ తానే ప్రభుత్వం అన్నట్లుగా మాట్లాడుతున్నారని ఆయన తప్పు పట్టారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం సరి కాదని అన్నారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని తెలుగువాళ్లందరికీ తమ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు.

విజయనగరం నుంచి వచ్చిన కెసిఆర్ మళ్లీ అక్కడికి వెళ్లిపోయే పరిస్థితి వస్తుదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుతో పాటు రాజధాని, విద్యుత్తు, జలాలు, ఉద్యోగాంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వానలి ఆయన అన్నారు. తెలంగాణ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రతిపాదించాలని ఆయన అన్నారు.

జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది జైలు పార్టీ దొంగలే అని కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. శనివారం నెల్లూరు ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఓపిక నశిస్తే వైయస్సార్ విగ్రహాల అంతు చేస్తామని హెచ్చరించారు. కెసిఆర్ ఉన్మాదిలో ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత కల్పించాలని ఆనం వివేకా డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజనపై ఉత్పన్నమవుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలని సిపిఎం నేత సీతారం ఏచూరి డిమాండ్ చేశారు. శనివారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాజధానిపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలన్నారు. దేశంలో 28 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయని, ఆర్థిక విధానంలో కాంగ్రెస్, బిజెపిలవి ఒకేటే పంథా అని సీతారం ఏచూరి విమర్శించారు.

English summary
Congress MLA Anam Vivekananda Reddy lashed out at YS Jagan's YSR Congress party leaders on the distruction of statues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X