విజయనగరం, కెసిఆర్ వెళ్లిపోవాల్సి వస్తుంది: దానం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ కాంగ్రెసు పార్టీకి దక్కుతుందనే ఉద్దేశంతో కెసిఆర్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు ఆందోళనలు చేసే హక్కు ఉందని ఆయన చెప్పారు. అయితే, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయడం సరి కాదని ఆయన అన్నారు. కెసిఆర్ అలాగే మాట్లాడితే హైదరాబాద్ గురించి పునరాలోచన చేయాల్సి వస్తుందని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాము కాంగ్రెసు అధిష్టానాన్ని కోరుతామని ఆయన చెప్పారు.
హైదరాబాదులో అన్ని రాష్ట్రాలకు చెందినవారున్నారని, వారిని రక్షించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే కాకుండా ప్రజాప్రతినిధులమైన తమపై కూడా ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ రాజ్యాంగ శక్తిగా, అసాధారమైన అధికారాలున్నావాడిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఆంధ్ర ఉద్యోగులను పంపించడానికి కెసిఆర్ ఏమైనా రాష్ట్రపతియా, ప్రధాన మంత్రియా, ముఖ్యమంత్రియా అని ఆయన అడిగారు. రాష్ట్రట విభజన అంశం వెనక్కి పోతే ఆ పాపం కెసిఆర్‌దే అవుతుందని ఆయన అన్నారు.
హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రతిపాదనను ఆయన వ్యతిరేకించారు. ప్రజాప్రతినిధులమైన తాము గాడిదలు కాయాలా అని ఆయన అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైతే లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోకి హైదరాబాదు వెళ్లిపోతుందని, అప్పుడు సాధారణ ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రాతినిధ్యం వహించేవారు ఉండరని ఆయన అన్నారు. కెసిఆర్‌కు ఓట్లు, సీట్లు కావాలని, దానికోసమే భయభ్రాంతులకు గురి చేసే ప్రకటన చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ విషయంలో సోనియా గాంధీ, ఇతర అధిష్టానం పెద్దలు తనను, మంత్రి ముఖేష్ గౌడ్‌ను అడిగారని, 56 ఏళ్ల సమస్యను పరిష్కరిస్తున్న సమయంలో కొత్త ప్రతిపాదనలను తెచ్చి సమస్యను జటిలం చేయవద్దని వారు తమకు చెప్పారని, దాంతో హైదరాబాదు విషయంలో కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి వదిలేశామని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటున్నామని చెప్పారు.
సమైక్య ఉద్యమంలో భాగంగా జాతీయ నేతల విగ్రహాల ధ్వంసాన్ని నిరసిస్తూ రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద శనివారం ఉదయం మౌన దీక్ష చేపట్టారు. అంతకు ముందు సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు.












Click it and Unblock the Notifications