రేపు హరికృష్ణ రాజీనామా, రిజైన్లు వద్దు: దిగ్విజయ్

కాగా, రాష్ట్ర విభజన నిర్ణయానికి రాజీనామాలు చేయవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధులను కోరారు. రాజీనామా చేస్తే రాష్టర్ విభజన బిల్లును శాసనసభ, పార్లమెంటుల్లో ప్రవేశపెట్టినప్పుడు సీమాంధ్ర ప్రాంత సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని రాజీనామా చేస్తే కోల్పోతారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సీమాంధ్ర ప్రాంత సమస్యలపై సూచనలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యపై దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రస్తుత తరుణంలో ప్రజలను రెచ్చగొట్టవద్దని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బ తీయవద్దని ఆయన సూచించారు. ఉద్యోగుల విషయం మీద గానీ, మరే విషయంపై గానీ నాయకులు ఎవరు కూడా ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
సీమాంధ్రుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కమిటీ వేస్తున్నామని, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కమిటీ ముందు తమ వాదనలు వినిపించవచ్చునని ఆయన అన్నారు. కమిటీలో తాను సభ్యుడిగా ఉంటానని ఆయన చెప్పారు. చట్టసభల్లో కూడా తమ వాదనలు లేవనెత్తవచ్చునని ఆయన అన్నారు. నిర్ణీత వ్యవధిలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications