భద్రాద్రి టీదే: సోనియా, కెసిఆర్ బొమ్మలకు పెళ్లి

Ramreddy Venkat Reddy
ఖమ్మం/ అనంతపురం : ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో ఉన్న సీతారాముడు తెలంగాణవాడేనని ఖమ్మం జిల్లాకు చెందిన ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. భద్రాచలాన్ని ఆంధ్రా ప్రాంతంలో కలుపుతున్నారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.

శుక్రవారం పాలేరులో మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాముడికి ప్రియ భక్తుడయిన భక్త రామదాసు పుట్టినగడ్డ నేలకొండపల్లి పాలేరు నియోజకవర్గంలోనే ఉందని తెలిపారు. జిల్లాలోని 46 మండలాలు తెలంగాణాలోనే ఉన్నాయని, భద్రాచలాన్ని వేరు చేయరాదని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు.

ఇదిలావుంటే, రాష్ట్ర విభజనకు నిరసనగా అనంతపురం జిల్లా ఓడీచెరువులో సమైక్యవాదులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దిష్టిబొమ్మలకు వివాహం జరిపించారు.

ఆ తరువాత కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను ఆటోపై కూర్చోబెట్టి పట్టణంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తర్వాత దిష్టిబొమ్మలకు కర్మకాండ నిర్వహించి నడి రోడ్డుపైనే దగ్ధం చేసి నోళ్లు బాదుకున్నారు. అక్కడే భోజనాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+