భారత కాన్సులేట్ వద్ద పేలుడు: ఆరుగురు మృతి

మృతులంతా సాధారణ పౌరులే. గాయపడినవారిలో అప్ఘానిస్తాన్ సైనికుడు ఉన్నాడని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా శుక్రవారం తన యాత్రికులను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శనివారం జలాలాబాద్‌లోని భారత కాన్సులేట్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కాబూల్ సహా ఉన్న 21 రాయబార కార్యాలయాలను, కాన్సులేట్లను ఆదివారం మూసి ఉంచాలని అమెరికా ఆదేశించింది. ఆత్మాహుతి దళ సభ్యుడు భారత కాన్సులేట్ వద్ద తనను తాను పేల్చివేసుకున్నాడని చెబుతున్నారు. భారత కాన్సులేట్‌కు వెళ్లే మార్గాలను మూసివేశారు.












Click it and Unblock the Notifications