నెహ్రూ పెళ్లి చేస్తే, సోనియా డైవర్స్: హరి, హైద్రాబాద్‌పై..

Nandamuri Harikrishna
హైదరాబాద్: తెలుగు వారికి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పెళ్లి చేస్తే... ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విడాకులు ఇప్పించారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఆదివారం మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

తెలుగు వారిని విభజించేందుకు ఇంత రాజకీయం అవసరమా అని కాంగ్రెసు పార్టీపై మండిపడ్డారు. విభజనకు వ్యతిరేకం కాదని అయితే, అన్ని ప్రాంతాలకు సమ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఎన్ని కమిటీలు వేశారని, అవన్నీ ఏమయ్యాయని, ఏం చెప్పాయని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ రహస్య నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలుగు మాట్లాడే ప్రజలను విడగొట్టేందుకు ఇంత రాజకీయం ఎందుకన్నారు.

నీటి వాటా, రాజధాని విషయం తేల్చాకే విభజన ప్రక్రియ చేపట్టాలన్నారు. విభజిస్తే పాలనాపరంగా వచ్చే సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పులు ఏ ప్రాంతం వారు తీర్చాలో చెప్పాలన్నారు. ఎవరిని అడిగి విభజించారని, నిర్ణయానికి ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా అన్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉద్యమించాలని కోరారు.

హైదరాబాద్ ఎవరి సొత్తు కాదు

హైదరాబాద్ ఎవరి సొత్తు కాదని, తెలుగు ప్రజలందరిది అన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు తెలుగు జాతిని రెండుగా చీల్చాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు భయపడవద్దని, వారికి టిడిపి అండగా నిలబడుతుందని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉండాలన్నారు. కొందరు స్వార్థపరుల రాజకీయ నాయకుల రాజకీయంలో భాగస్వాములు కావడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెసు దుష్టశక్తి అన్నారు.

ఇక నుండి మనమంతా తెలుగు జాతి మనది... రెండుగ చీలిన వెలుగు జాతి మనది అని పాడుకోవాలా అన్నారు. పాండవులను, కౌరవులను శకుని పాచికలతో విడదీస్తే... అన్నదమ్ములుగా ఉన్న తెలుగు వారిని కాంగ్రెసు, సోనియా గాంధీ విడదీశారని నిప్పులు చెరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+