చిరంజీవి ఇమేజ్ ఎంతో తెలుసు, వెనుక సిఆర్: జోగయ్య

Hari Rama Jogaiah
విశాఖ/విజయనగర: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి పరపతి హైదరాబాదులో ఏమాత్రం ఉందో అందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత హరి రామ జోగయ్య ఆదివారం మండిపడ్డారు. విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చిరంజీవి వెనుక మంత్రి సి.రామచంద్రయ్య ఉండి నడిపిస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెసు మొదట హైదరాబాద్ విషయం తేల్చాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు. సాగునీటి విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని హరి రామ జోగయ్య ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రంలో దెయ్యాల పెట్టెను తెరియారని, అది దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఆజ్యం పోసిందని ఆ పార్టీకి చెందిన మరో నేత దాడి వీరభద్ర రావు అన్నారు. సచివాలయం అందరి ఆస్తి అని, సీమాంధ్ర ప్రాంతం వ్యవహారాల కోసం ప్రత్యామ్నాయ ప్రాంతాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దానిని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.

షాక్‌కు గురయ్యా: శైలజానాథ్

యూపిఏ, సిడబ్ల్యూసిలో విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని ప్రకటన వెలువడగానే తాను షాక్‌కు గురయ్యాలనని మంత్రి శైలజానాథ్ అన్నారు. నాటి నుండి తాను జ్వరంతో బాధపడుతున్నానని చెప్పారు. తన రాజీనామా లేకను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చానని, సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వచ్చే వరకు సచివాలయంలో అడుగుపెట్టనని చెప్పారు.

సమైక్యాంధ్ర కోసం అనుకూలంగా చేసిన తీర్మానం పైన కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు సంతకం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అలా తీర్మానం చేయగలరా అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+