హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీ సీట్లు, తెరాస కోసమే: వంశీ, కెసిఆర్ జాగిరా: గంటా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamshi - Ganta Srinivas Rao
విజయవాడ/అనంతపురం: ఎపి రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు చూస్తుంటే పార్లమెంటు స్థానాల కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని మచ్చిక చేసుకునేందుకే మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ ఆదివారం అన్నారు. విభజనపై వంశీ స్పందించారు.

ఓ రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి అలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. దిగ్విజయ్ సింగ్ చెల్లని కాగితంగాలా ఢిల్లీకి వచ్చి.. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కొరియర్ బాయ్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మూడు ప్రాంతాల ప్రయోజనాలు కాపాడాలని చెప్పారన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ఇతర నేతలు ఢిల్లీకి పరిమితమయ్యేలా కనిపిస్తోందన్నారు. సీమాంధ్ర ఉద్యోగులపై తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలా మాట్లాడవద్దన్నారు.

సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటాం: గంటా

సీమాంధ్ర ఉద్యోగులకు అండగా ఉంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. హైదరాబాద్ కెసిఆర్ జాగీర్ కాదన్నారు. సోమవారం విజయవాడలో జెఏసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సీమాంధ్రుల ఒత్తిడితే కేంద్రం విభజన ప్రకటనపై వెనక్కి తగ్గుతుందన్నారు.

ఈ నెల 11న హైదరాబాదులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సభను సీమాంధ్రులు అడ్డుకోవాలని మంత్రి కొండ్రు మురళి పిలుపునిచ్చారు. విభజనకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బిజెపి నేతలే అని మండిపడ్డారు.

English summary
Telugudesam Party senior leader Vallabhaneni Vamshi has lashed out at AP Congress Party incharge Digvijay Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X